బహుశా విశాల్ లా ఎవరు చేసి ఉండరు…!

Published on Aug 8, 2019 1:39 pm IST

అనుకున్న విధంగానే విశాల్ తన మూవీ “అయోగ్య” తెలుగు వర్షన్ రేపు థియేటర్లలో దించనున్నారు. హడావుడిగా రెండు రోజుల నుండి “అయోగ్య” విడుదల అంటూ విశాల్ సందడి మొదలుపెట్టాడు. ఐతే “మన్మధుడు 2” మినహా ఈ వారం పెద్ద చిత్రాలేమి లేకపోవడం ఈ మూవీకి ఒకింత కలిసొచ్చే అంశం. రేపు అనసూయ “కధనం” తోపాటు కన్నడ పౌరాణిక చిత్రం “కురుక్షేత్రం” విడుదల కానున్నాయి.

విశాల్ నిజానికి ఈ చిత్రాన్ని గత నెల 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే థియేటర్ల సమస్యతోనో,మారే ఇతర కారణాలతోనో విడుదల కాలేదు. ఇన్నాళ్లు విశాల్ ఈ మూవీ ప్రొమోషన్స్ కూడా చేయలేదు. మళ్ళీ సడన్ గా విడుదల తేదీ ప్రకటించి ఆశ్చర్య పరిచారు విశాల్. వీటన్నిటి కంటే మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే “అయోగ్య” తెలుగులో హిట్ అయిన “టెంపర్” చిత్రానికి తమిళ రీమేక్ చిత్రం. తెలుగులో “టెంపర్” ని తమిళంలో “అయోగ్యగా” తీసి, మళ్ళీ దాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు విశాల్.

“టెంపర్” లో ఎన్టీఆర్,పూరి చూయించని ప్రత్యేకమైన విషయం “అయోగ్య”లో విశాల్ ఏమి చూపించనున్నాడు అనేది ఆసక్తికర విషయం. ఐతే “అయోగ్య”లో పతాక సన్నివేశాలతో పాటు, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలలో మేజర్ మార్పులు చేశారని సమాచారం. మరి విశాల్ “అయోగ్య”తో ఎంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More