పవన్ రీ ఎంట్రీకి ముహూర్తం నేడే..!

Published on Jan 20, 2020 1:19 pm IST

ఎట్టకేలకు పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ అధికారికంగా నేడు సినిమాలలోకి తన రీ ఎంట్రీని ఖరారు చేయనున్నారు. ఆయన హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ వేదికగా వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. పవన్ పై మొదటి సన్నివేశంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ ఈ చిత్రంలో సెన్సిబుల్ లాయర్ రోల్ చేస్తుండగా, ఒరిజినల్ పింక్ చిత్రానికి కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అజ్ఞాతవాసి విడుదలై సరిగ్గా రెండేళ్లు అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేసిన అజ్ఞాతవాసి 2018 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఆ చిత్రం విడుదలైన రెండేళ్లకు పవన్ మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. పింక్ తరువాత పవన్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న పీరియాడిక్ మూవీలో నటించే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More