నేడు విడుదలకానున్న సామీ స్క్వేర్ రెండవ ట్రైలర్ !
Published on Sep 10, 2018 1:02 pm IST

చియాన్ విక్రమ్ మరో సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘సామీ స్క్వేర్’. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈచిత్రం విడుదలకు సిద్దమవుతుంది. హరి తెరకెక్కిస్తున్న ఈచిత్రం విక్రమ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సామి’ కి సీక్వెల్ గా వస్తుంది.ఇక ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. దాంతో ఇప్పుడుఈ చిత్రం యొక్క రెండవ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈరోజు సాయత్రం 6గంటలకు ఈ తమిళ వెర్షన్ సెకండ్ ట్రైలర్ విడుదలకానుంది.

ఇక ఈచిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం ఫై కావ్య వేణుగోపాల్ , బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ పేరుతో విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈచిత్ర తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇప్పటివరకు 27లక్షల పైచిలుకు వ్యూస్ ను రాబట్టుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో తమిళ హీరో బాబీ సింహ ప్రతినాయకుడిపాత్రలో నటిస్తుండగా ఐశ్వర్యా రాజేష్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబూ తమీన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 3వ వారంలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • 8
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook