ఆల్ క్లియర్.. సోలోగా రానున్న ‘అఖిల్’

ఆల్ క్లియర్.. సోలోగా రానున్న ‘అఖిల్’

Published on Nov 3, 2015 6:42 PM IST

akhil
అక్కినేని నాగార్జున – అమల లతో పాటు అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నది ‘అఖిల్’ సినిమా కోసం అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. అక్కినేని ఫ్యామిలీ మూడవతరం హీరో అఖిల్ అక్కినేని పరిచయం కానున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. దసరా కానుకగా అనుకున్న ఈ సినిమా క్వాలిటీ విఎఫ్ఎక్స్ వలన వాయిదా పడినా ఇప్పుడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 11న దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమయ్యారు.

మొదట ఈ దీపావళి సీజన్ లో అఖిల్ కి పోటీగా కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ చీకటి రాజ్యం సినిమా నవంబర్ 20కి వెళ్ళడంతో దీపావళికి అఖిల్ ఒక్కటే బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనుంది. అలాగే ఈ వారం కూడా త్రిపుర అనే సినిమా తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం అలాగే ముందుగా 20న రావాలనుకున్న శంకరాభరణం సినిమా కూడా డిసెంబర్ 4 కి వెళ్ళడంతో అఖిల్ కి దాదాపు రెండు వారలు బాక్స్ ఆఫీసు వద్ద ఖాళీ దొరికింది. అఖిల్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు ఇక ఆ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షానికి అస్సలు కొదవే ఉండదు.

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తో పక్కా కమర్షియల్ సినిమాగా అఖిల్ ని సిద్దం చేసాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాని నితిన్ నిర్మించాడు.

తాజా వార్తలు