ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ రిలీజ్ కి అన్నీ సిద్దం

ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ రిలీజ్ కి అన్నీ సిద్దం

Published on Feb 12, 2015 9:42 AM IST

temper

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఎ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ప్రప్రంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ మొత్తం ఈ టెంపర్ ఫీవర్ ఎక్కువగా ఉంది. రేపు రిలీజ్ కోసం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే ఓవర్సీస్ కి వెళ్ళాల్సిన ప్రింట్స్ కూడా రీచ్ అయిపోవడంతో అక్కడ కూడా ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసుకుంటున్నారు.

హైదాబాద్ తో పాటు ఆంధ్ర, తెలంగాణలోని పలు నగరాల్లో కూడా ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడనున్నాయి. ఈ బెనిఫిట్ షో టికెట్స్ కి కూడా ఫుల్ క్రేజ్ ఉండడంతో, టికెట్స్ ధర ఎక్కువైంది. ప్రతి చోటా బెనిఫిట్ షౌస్ కి పర్మిషన్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల వీక్షించడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ మరియు ఎన్.టి.ఆర్ ని చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని సమాచారం.

వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో కష్టపడే బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు