డైరెక్టర్ ని హీరోగా చూడటానికి డైరెక్టర్స్ అందరూ వచ్చారుగా

Published on Oct 10, 2019 3:00 am IST

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం శీనయ్య. నిన్న దసరా పండుగను పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం నేడు వి వి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. నూతన దర్శకుడు నరసింహ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. చేతిలో రెంచ్, మేడలో ఎర్ర కండువా తో ఉన్న వినాయక్, ఈ చిత్రంలో మెకానిక్ పాత్ర చేస్తున్నాడనిపిస్తుంది.

కాగా ఈ మూవీ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ లో ని ప్రముఖ దర్శకులందరూ హాజరుకావడం గమనార్హం. కొరటాల శివ, సుకుమార్, మెహర్ రమేష్,వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సీనియర్ దర్శకులు దర్శకేంద్రుడు రాఘవేంద్రావు వినాయక్ పై క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలు తెలియల్సివుండగా, వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని వినికిడి.

సంబంధిత సమాచారం :

X
More