బాలయ్య నుంచి అన్ని ట్రీట్స్ అప్పుడేనట.!

Published on May 30, 2021 9:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “అఖండ”. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై భారీ స్థాయి అంచనాలు ఊదా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ మేకర్స్ ఇస్తూ వచ్చారు. అలాగే గత మే 28న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అని టాక్ వచ్చింది కానీ అది కాస్తా రాలేదు.

మరి ఆ అప్డేట్ సహా మరో కీలక అప్డేట్ వచ్చే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అయితే ఆరోజున ఫస్ట్ సింగిల్ తో పాటుగా మరో టీజర్ ఉంటుందా ఉండదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆరోజు మాత్రం ఒక దానికంటే ఎక్కువ రావచ్చని తెలుస్తుంది. మరి ఆ రోజు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :