రాష్ట్ర విభజన తర్వాత పలువురు దర్శకులు తెలంగాణ నేటివిటీపై సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా అల్లాని శ్రీధర్ తెలంగాణలో జీవించి, తెలంగాణాకి సేవలు చేసిన వారిపై ఓ డాక్యుమెంటరీ చేయడానికి శ్రీకారం చుట్టారు. అలలని శ్రీధర్ గతంలో గౌతమ్ బుద్ధ, హనుమాన్ చాలీసా, చిలుకూరు బాలాజీ, కొమరం భీమ్ లాంటి సినిమాలను తెలంగాణ ప్రజలకు అందించాడు. అంతే కాకుండా కొన్ని సీరియన్స్ కి కూడా దర్శకత్వం వహించాడు.
ఆయన తెలంగాణా ఓడిలో పెరిగిన మహా మహుల గురించి చెబుతూ తీయాలనుకున్న డాక్యుమెంటరీకి ‘తెలంగాణ తేజో మూర్తులు’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ డాక్యుమెంటరీలో రాణి రుద్రమదేవి, పాల్కూరికి సోమనాద్, కాళోజి, తెలంగాణ సిఎం కెసిఆర్, ప్రొఫెసర్ జై శంకర్, మలినాడా సూరి, వేములవాడ భీమకవి మొదలైన వారి గురించి చెప్పనున్నాడు. ఫిలింమీడియా ప్రొడక్షన్ బ్యానర్ పై అల్లాని శ్రీధర్ దర్శక నిర్మాతగా ఈ డాక్యుమెంటరీ తీయనున్నాడు.


