అల్లరి నరేష్ మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు !
Published on Mar 3, 2018 5:54 pm IST

అల్లరి నరేష్ హీరోగా బిమినేని శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా తాజా షెడ్యూల్ హైదారాబాద్ లో ప్రారంభం అయ్యింది. వరంగల్ పరిసర ప్రాంతాల్లోఈ సినిమా షూటింగ్ కొంతవరుకు జరిగింది. చిత్ర శుక్ల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ అల్లరి నరేష్ ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారు. తెలుగులో ఉన్న దాదాపు హాస్య నటినటులు ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం.

శ్రీ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మేడమీద అబ్బాయి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మంచి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు నరేష్. ఈ సినిమా తరువాత ఏకే బ్యానర్ లో గిరి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు నరేష్. గిరి గతంలో నందిని నర్శింగ్ హోం సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ ప్రాజెక్ట్ తో పాటు డైరెక్టర్ సత్తిబాబుతో ఒక సినిమా చెయ్యనున్నాడు ఈ హీరో.

 
Like us on Facebook