ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – ఈ సినిమాలో నేను, సునీల్.. హీరో హీరోయిన్స్ లా ఉంటాము !

ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – ఈ సినిమాలో నేను, సునీల్.. హీరో హీరోయిన్స్ లా ఉంటాము !

Published on Sep 5, 2018 4:24 PM IST

భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ మరియు నరేష్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ సంధర్బంగా అల్లరి నరేష్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురంచి చెప్పండి ?

సిల్లీ ఫెలోస్ లో నా క్యారెక్టర్ పేరు ‘వీర బాబు’. ఒక లేడీస్ టైలర్, కానీ ఎప్పటికైనా తనకి ఎమ్మెల్యే అవ్వాలని బలమైన కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసం ఎవర్నైనా వాడుసుకుంటుంటాడు. ఆ క్రమంలోనే నా పాత్ర సునీల్ గారి పాత్ర ప్రతి విషయంలో వాడుకుంటూ.. ఆయన్ని బుక్ చేస్తుంటుంది. దాంతో ఆయన ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడతాడు అనేది చాలా ఆసక్తిగా కామెడీ ఉంటుంది.

చాలా సంవత్సరాల తర్వాత మీరు సునీల్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎలా అనిపించింది ?

చాలా బాగుంది అండి. ఎందుకంటే బ్రహ్మానందంగారు గాని, సునీల్ గారు గాని కామెడీ లో పండిపోయారు. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కి ఎంత నవ్వుతారు, ఏ పంచ్ కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలి వాళ్లకి బాగా తెలుసు. అలాంటి వారితో సీన్ చేస్తుంటే కామెడీ బాగా పండుతుంది. షూట్ చేసేముందు కూడా సునీల్ గారు నేను చాలా డిస్కస్ చేసుకొని చేశాము. మా నుంచి గతంలో ఎలాంటి కామెడీ వచ్చిందో, మళ్లీ అలాంటి కామెడీ కోసం ట్రై చేశాము అలాగే వచ్చింది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమాలో సునీల్ గారు నేను హీరోలుగా కాదు, హీరో హీరోయిన్స్ లా ఉంటాము.

సునీల్ గారు గాని, మీరు గాని కామెడీలో స్టార్స్. మరి మీ ఇద్దరు కలిసి నటిస్తోన్న సినిమా మీద ఎక్స్ పెటేషన్స్ ఎక్కువు ఉంటాయి. ఆ ఎక్స్ పెటేషన్స్ రీచ్ అవ్వటానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు ?

ఎక్స్ పెటేషన్స్ ఎక్కువుగా ఉంటే మంచిందే కందండి. మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఇక కేర్ అంటే.. సూప్ కామెడీలు, సంచుల కొద్ది పంచ్ లు పెట్టకుండా, బుక్స్ లో జోక్స్, వాట్సాఫ్ జోక్స్ లాంటి రెగ్యులర్ జోక్స్ పెట్టకుండా, స్క్రిప్ట్ దగ్గర నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతిదీ కొత్తగానే ట్రై చేశాము. ఈ సినిమాలో సిట్యుయేషన్ కామెడీ చాలా బాగా వచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తారు.

మీరు ఏభై సినిమాలు వరకు చాలా స్పీడ్ గా చేసేశారు. మరి ఎందుకు ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేయట్లేదు. కారణాలు ఏమైనా ఉన్నాయా ?

కారాణాలు అంటే.. సినిమా ఆఫర్స్ అయితే చాలా వస్తున్నాయి అండి. ఈ వన్ ఇయర్ టు ఇయర్స్ లోనే నాలుగైదు సినిమాలు రిజక్ట్ చేశాను. ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి పెద్దగా ఆడలేదు కూడా. ఇంకా నేను డబ్బు కోసం కాకుండా, నెం ఆఫ్ ఫిల్మ్ స్ కాకుండా.. క్వాలిటీ ఫిల్మ్ స్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. ప్రస్తుతం అలాంటి సినిమాలనే చేసుకుంటూ వెళ్తున్నాను.

ఈ సినిమా షూటింగ్ దశలోనే టైటిల్ గా సుడిగాడు 2 అని పెట్టాలనుకున్నారని వార్తలు వచ్చాయి ?

మా డైరెక్టర్ గారికి ‘సు’ సెటిమెంట్. అలా ఓ స్టేజీలో సుడిగాడు 2 పెట్టాలనుకున్నాం. కానీ సుడిగాడు ఊహించుకొని సినిమాకి వస్తారు. ఈ సినిమా ఎంత గొప్పగా ఉన్నా సరే.. ఆ సినిమా మైండ్ సెట్ లోనే ఉంటారు అనిపించింది. అయినా ఓ కొత్త సినిమా చేస్తున్నాం ఓ కొత్త టైటిల్ నే పెట్టాలనుకున్నాం. అలా సిల్లీ ఫెలోస్ పెట్టడం జరిగింది. ఇక సుడిగాడు 2 మూవీ అయితే ఉంది, కాకపోతే చెయ్యాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.

భీమనేని గారిది, మీది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. మరి ఈ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుందా ?

(నవ్వుతూ) ఏదైనా సక్సెస్ బట్టే ఉంటుంది కదండీ. అంటే.. నెక్స్ట్ ‘సుడిగాడు 2’ చెయ్యమని డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు చాలామంది అడుగుతున్నారు. కానీ చేస్తే దాన్ని మించి చెయ్యాలి. బట్ నాకేమో నా పెర్ఫామెన్స్ చూపించుకోకుండా ఇలా సూప్ లు చేస్తూ వెళ్లడం నచ్చట్లేదు. నేను యాక్టింగ్ కోర్స్ లో నేర్చుకున్న పదం ఒక్కటే అండి. ఇమిటేషన్ ఈజ్ నాట్ యాక్టింగ్. సో నాకంటూ ఓ స్టైల్ ఉంది. నేను నా స్టైల్ లోనే సినిమాలు చెయ్యాలి, అలాగే నవ్వించాలి అనుకుంటున్నాను.

మహేష్ బాబు గారి సినిమాలో మీ క్యారెక్టర్ కి మంచి పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉంటుందా ?

ఆ సినిమాకి ఇంకా చాలా టైం ఉందండి. ఒక్కటైతే చెప్తాను. నా కెరీర్ లో ఆ క్యారెక్టర్ నాకు మళ్లీ గమ్యం సినిమాలో గాలి శ్రీను లాంటి క్యారెక్టర్ అవుతుంది.

మహేష్ బాబుగారు మీ కాంబినేషన్ లో షూట్ చేసారా ?

దాదాపు 45 డేస్ షెడ్యూల్ అయింది. ఇంకా అక్టోబర్ నుంచి దాదాపు జనవరి వరకు మళ్లీ ఓ వంద రోజులు ప్రయాణం ఉంది.

మహేష్ గారికి స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎలా అనిపించింది ?

చాలా బాగుంది. బేసిగ్గా ఇద్దరం ఒక్కటే హైట్. ఆయన చాలా బాగా కోపరేట్ చేస్తారు. చాలా సరదాగా ఉంటారు. ఆయనతో యాక్ట్ చెయ్యటం మాత్రం చాలా హ్యాపీ గా ఉంది.

ఒక పక్క హీరోగా చేస్తూనే.. సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తారా ?

నేను మొదటినుంచి ఒక్క హీరోగానే చెయ్యాలి అని నియమం ఏం పెట్టుకోలేదండి. క్యారెక్టర్ బాగుంటే, నాకు నచ్చితే.. నేను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. గతంలో కూడా గమ్యం చేశాను. రాజీవ్ కనకాలగారు హీరోగా, నేను విలన్ గా ఓ సినిమా కూడా చేశాను. నాకు క్యారెక్టర్ నచ్చితే చేస్తాను.

ఈ మధ్య మీ సినిమాలు సరిగ్గా ఆడకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనుకుంటున్నారు ?

సినిమా హిట్ అయినా ప్లాఫ్ అయినా స్క్రిప్టే మెయిన్ అండి. నా సినిమాల్లో ఓ సినిమాకి కథ ఎక్కువై కామెడీ తక్కువ అయిందంటారు. ఇంకో సినిమాకి కామెడీ ఎక్కువై కథ తక్కువ అయిందంటారు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. నేను ఏమనుకుంటున్నాను అంటే.. సుడిగాడు దగ్గర నుంచి నా సినిమాల్లో ఎమోషన్ మిస్ అవుతుంది. ఎమోషన్ సీన్ లో కూడా నవ్వించడానికి ట్రై చెయ్యటం కరెక్ట్ కాదు అనిపించింది. కామెడీని కామెడీగానే డీల్ చెయ్యాలి. ఎమోషన్ని ఎమోషన్ గానే డీల్ చెయ్యాలి.

అమెజాన్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక వెబ్ సిరీస్ లు ఎక్కువుగా వస్తున్నాయి. వెబ్ సిరీస్ చెయ్యమని మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యారా ?

ఆమెజాన్ వారు అడిగారండి. అంటే మంచి క్యారెక్టర్, మంచి కంటెంట్ ఉంటే చేస్తాను. ఇప్పుడు సినిమాలల్లో నెను కామెడీ చేస్తున్నాను, మళ్లీ అక్కడ కూడా కామెడీనే చెయ్యటం ఇష్టం లేదు. కొంచెం కొత్తగా చెయ్యాలని ఉంది. అలాంటి వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను.

మీరు ఓ స్టార్ డైరైక్టర్ కొడుకు. మరి మీ నాన్నగారిలాగే మీకు కూడా డైరెక్షన్ చేయాలని లేదా ?

డైరెక్షన్ చేస్తాను అండి. 2020లో నేను డైరెక్షన్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. (నవ్వుతూ) అంటే ప్రస్తుతం విజన్ 20 20 అని పెట్టుకున్నాను. ఇక నేను డైరెక్ట్ చేసే సినిమాలో మాత్రం హీరోగా నేను చెయ్యను. మా రవిబాబు లాగా సడెన్ గా ఇలా తిరిగి పేస్ చూపించను. అందర్నీ కొత్తవారిని పెట్టి ఓ లో బడ్జెట్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలని ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు