అల్లరి నరేష్ దీపావళికి సందడి చేస్తాడట.

Published on Aug 15, 2019 5:00 pm IST

అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. దోసిలి నిండా బంగారు నగలు పట్టుకొని వాటివైపు ఆనందంగా చూస్తున్న నరేష్ లుక్ బాగుంది. దర్శకుడు పి వి గిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది దివాళి కానుకగా రానుందంటూ ఆ పోస్టర్ లో హింట్ కూడా ఇచ్చేశారు. ఈ మూవీలో నరేష్ సరసన హీరోయిన్ గా పూజా ఝవేరి నటిస్తుందని సమాచారం.

‘అల్లరి’ సినిమాతో కామెడీ హీరోగా 2002లో తెలుగు తెరకు పరిచయమైన నరేష్ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 90 లనాటి, కామెడీ హీరోలైన, రాజేంద్రప్రసాద్, నరేష్, అలీ వంటి నటులకు ప్రెసెంట్ ట్రెండ్ లో అల్లరి నరేష్ ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. 17 ఏళ్ల కెరీర్ లోనే అల్లరి అర్థ శతకానికి పైగా చిత్రాలు చేశాడంటేనే అర్థం అవుతుంది ఆయన స్పీడ్ ఏమిటో. ఐతే గత కొంత కాలంగా నరేష్ చిత్రాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఆయన నెమ్మదించారు.

సంబంధిత సమాచారం :