మహేశ్ వస్తే ఏదోకటి చేస్తాడన్నగా.. చేశాడు – అల్లరి నరేష్

Published on May 19, 2019 10:39 am IST

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్న అల్లరి నరేష్ కి ఎట్టకేలకూ ‘మాహర్షి’తో భారీ హిట్ వచ్చింది. సినిమాలో నరేష్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా నటించనిప్పటికీ.. మహేశ్ బాబు ఫ్రెండ్ గా కథలో చాలా కీలకమైన పాత్రలో నటించడంతో.. పైగా మహేష్ – నరేష్ మధ్య ఫ్రెండ్ షిప్ కి సంబంధించిన సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవడంతో ‘మహర్షి’ మహేశ్ బాబుకి ఎంత సంతృప్తిని ఇచ్చిందో.. అల్లరి నరేష్ కి కూడా అంతే సంతృప్తి ఇచ్చింది.

కాగా మాహర్షి విజయోత్సవ వేడుకను చిత్రబృందం నిన్న విజయవాడలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, నన్ను నమ్మిన దర్శకుడు వంశీకి కృతజ్ఞతలు. రిషి వస్తే ఏదోకటి చేస్తాడు… చేశాడు..మహర్షి ని ఎపిక్ బ్లాక్ బస్టర్ చేశాడు. ఈ సినిమాలో ఆయన పంట ఎంత పండిందో ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ల పంట కూడా పండింది’ అని అన్నారు. మొత్తానికి నరేష్ మాటల్లో మహేష్ బాబు తనకు హిట్ ఇచ్చాడనే అనందం కనబడింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More