అల్లరి నరేష్ ట్రేడ్ మార్క్ కామెడీతో ‘బంగారు బుల్లోడు’

Published on Jan 19, 2021 11:08 pm IST

ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ అల్లరి నరేష్ కొత్త చిత్రం ‘బంగారు బుల్లోడు’. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ గిరి పాలిక ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 23న సినిమా రిలీజ్ కానుంది.
బంగారు దుకాణంలో వర్క్ చేస్తూ గ్రామీణ బ్యాంక్లో పనిచేసే కుర్రాడి కథే ఈ చిత్రం. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగేలా ఈ చిత్రాన్ని రూపొందించారట టీమ్. ఈరోజు విడుదలైన ట్రైలర్లో సైతం అల్లరి నరేష్ ట్రేడ్ మార్క్ కామెడీ కనిపిస్తోంది. నరేష్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే తరహా కామెడీ ఇందులో ఉంటుందని అనిపిస్తోంది. నరేష్ సైతం ఈ సినిమా విజయం మీద నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు.

బెండు అప్పారావు తర్వాత పక్కా విల్లేజ్ బ్యాక్ డ్రాప్ కథతో నరేష్ సినిమా చేయలేదు. అలాంటి సినిమా చేయాలని ఈ కథ రాసి సినిమా చేశామని, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. నరేష్ సరసన పూజా జవేరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, అజయ్ గోష్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, అనంత్, భద్రం, నవీన్, భూపాల్, రమాప్రభ, రజిత, జోగిని శ్యామల తదితరులు నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :