బాండ్ ‘జేమ్స్ బాండ్’ అంటూ త్వరలో మనముందుకు రానున్నాడు టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఆ జేమ్స్ బాండ్ ని ‘నేను కాదు నా పెళ్ళాం’ అంటున్నాడు మన అల్లరోడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్స్ తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘జేమ్స్ బాండ్’, ‘నేను కాదు, నా పెళ్ళాం’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు.
కానీ గత వారం రిలీజ్ అయిన భారీ పీరియాడికల్ ఫిల్మ్ బాహుబలి బాక్స్ ఆఫీసు వద్ద హల్ చల్ చేస్తుండడంతో ఆ సినిమాకి ఈ వారం కూడా లైన్ క్లియర్ చేస్తూ ‘జేమ్స్ బాండ్’ సినిమాని వాయిదా వేసారు. అనగా ఒక వారం ఆలస్యంగా జూలై 24న సినిమాని రిలీజ్ చేయనున్నారు. ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో సిస్టర్ పెట్టిన టార్చర్ తో మనల్ని నవ్వించిన అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తరహా భార్యతో వచ్చే ఇబ్బందుల ద్వారా మనల్ని నవ్వించనున్నాడు. అల్లరోడికి చుక్కలు చూపించే మాఫియా డాన్ వైఫ్ గా సాక్షి చౌదరి నటించింది.
ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కాకుండా అల్లరి నరేష్ – కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాంబినేషన్ లో శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.


