ప్రారంభమైన అల్లరి నరేష్ “సభకు నమస్కారం” చిత్రం!

Published on Aug 12, 2021 6:02 pm IST

నాంది చిత్రం తో సాలిడ్ హిట్ అందుకున్న అల్లరి నరేష్, తను చేయబోయే తదుపరి చిత్రాలు సైతం అదే తరహాలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తిమ్మరుసు తో సూపర్ హిట్ సాధించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో మరొక చిత్రం ప్రారంభం అయింది. అల్లరి నరేష్ చిత్రం సభకు నమస్కారం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి నరేష్ కూతురు అయాన క్లాప్ కొట్టగా, నాంది చిత్రం దర్శకులు విజయ్ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు.

న‌రేశ్ 58వ చిత్ర‌మిది. ఆయ‌న పుట్టిన‌రోజున విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతుండటం తో సినిమా ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి జోనర్‌లో న‌రేశ్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి.
అల్లరి నరేష్ సభకు నమస్కారం చిత్రానికి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల సెప్టెంబర్ నుండి మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :