మొత్తానికి చూస్తుండగానే కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అందించి 2018 కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం కొత్త ఏడాది మొదటి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ బిజీ లైఫ్‌లో వ్యక్తిగతంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే సమయం ఉండదు. అందుకే సెల్ ఫోన్ లో వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలను పంపిస్తుంటారు చాలామంది బిజీ పర్సన్స్.
కానీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాత్రం తన గీతా ఆర్ట్స్ టీమ్ తో పాటు స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి మరి.. మెగాస్టార్ కి 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.


