కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.
అయితే, ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాలను అలరించే విధంగా తీర్చిదిద్దామంటూ మేకర్స్ మరోసారి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా లాభాల నుంచి కొంతమేర ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.
