పండగల్ని పక్కాగా టార్గెట్ చేసిన మెగా ప్రొడ్యూసర్

Published on Dec 2, 2019 11:22 pm IST

తెలుగు పరిశ్రమలోని పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. చిన్న సినిమాలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా బడా నిర్మాత స్థాయికి ఎదగడానికి అల్లు అరవింద్ ఖచ్చితమైన ప్లానింగే ప్రధాన కారణం. ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏ పండక్కి ఎలాంటి సినిమా చేస్తే లాభదాయకంగా ఉంటుందనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఇంకో రెండు నెలల్లో రానున్న పెద్ద పండగల్ని టార్గెట్ చేసి పెట్టుకున్నారు.

డిసెంబర్ నెల అంటేనే పరిశ్రమలో ఒకరకమైన నెగెటివ్ వైబ్ ఉంది. అందుకే ఈ సీజన్లో స్టార్ హీరోలెవరూ పెద్దగా సినిమాల్ని రిలీజ్ చేయరు. అయితే క్రిస్టమస్ పండగ నాడు మాత్రం సినిమాలకు డిమాండ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ధరమ్ తేజ్ హీరోగా రూపొందించిన మీడియమ్ బడ్జెట్ సినిమా ‘ప్రతిరోజూ పండగే’ను డిసెంబర్ 20న విడుదలచేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అరవింద్.

ఇక పెద్ద హీరోలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగనాడు సినిమా విడుదలై బాగుందనిపించుకుంటే వచ్చే రిజల్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే తన కుమారుడు అల్లు అర్జున్ హీరోగా నిర్మించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. మొత్తానికి పక్కా పథకం ప్రకారం అల్లు అరవింద్ రెండు పండగల్ని క్యాష్ చేసుకోనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More