ప్రిన్స్ భారతగా శాకుంతలం లో “అల్లు అర్హా”

Published on Jul 15, 2021 2:40 pm IST


తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొంది తర్వాత తరాలకు ఆదర్శం అయ్యారు అల్లు రామలింగయ్య గారు. అయితే ఆయన తర్వాత సినిమా రంగం లో నిర్మాతగా అల్లు రామలింగయ్య కొడుకు అయిన అల్లు అరవింద్ ఎన్నో చిత్రాలను నిర్మించారు. అయితే ఆయన కుమారుడు అయిన అల్లు అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నాల్గవ తరం వారసురాలు, అల్లు అర్జున్ కూతురు అయిన అల్లు అర్హా తన తొలి చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలివుడ్ గా మారింది.

మితాలజికల్ డ్రామా గా తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రం కి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో టైటిల్ రోల్ సమంత అక్కినేని పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం లో కీలక పాత్ర అయిన ప్రిన్స్ భారత పాత్ర లో అల్లు అర్హ నటించనున్నారు. అయితే అల్లు అర్జున్ విషయం పట్ల ఎంతో భావోద్వేగం వ్యక్తం చేస్తూ గుణ శేఖర్ కి మరియు నీలిమ గుణ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం లో దేవ్ మోహన్, అదితి బాలన్, మోహన్ బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ ప్రకటన వెలువడిన అనంతరం నుండి అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :