అల్లు అర్జున్ 19 టైటిల్ ఇదేనా ?

Published on Mar 17, 2019 2:54 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని తెలిసిందే. అయితే ఈ వార్త తప్ప సినిమా అప్డేట్స్ గురించి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘నాన్న నేను’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల ఫై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ఈ సినిమా అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇక బన్నీ కి త్రివిక్రమ్ తో ఇది మూడో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో ‘జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి’ అనే సినిమాలు తెరకెక్కాయి.

సంబంధిత సమాచారం :

More