వారి రాకతో ప్రేమకు అర్థం తెలిసింది-అల్లు అర్జున్

Published on Apr 3, 2020 10:07 am IST

కరోనా క్వారంటైన్ లో ఉన్న అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ బర్త్ డే ని కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా కానిచ్చేశాడు. బన్నితో ఆయన భార్య స్నేహ రెడ్డి, కూతురు కలిసి అయాన్ ఆరవ బర్త్ డే సింపుల్ గా ముగించారు. అయాన్ కేక్ కట్ చేసే అమ్మానాన్నలతో పంచుకున్నాడు. 2011లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ని పెళ్లి చేసుకోగా వారికి అయాన్ మరియు అర్హ కొడుకు కూతురు ఉన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పిల్లల పట్ల తనకున్న ప్రేమ తెలియజేశారు. వారు జీవితంలోకి వచ్చాకే ప్రేమకు నిజమైన నిర్వచనం తెలిసింది అన్నారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్స్ లో తన 20వ చిత్రంలో నటిస్తున్నారు . ఇప్పటికే ఈమూవీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కేరళలో మొదలు కావాల్సివుండగా కరోనా కర్ఫ్యూ కారణంగా వాయిదా పడింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More