‘త్రివిక్రమ్ – బన్నీ’ సినిమా షూట్ కి డేట్ ఫిక్స్ !

‘త్రివిక్రమ్ – బన్నీ’ సినిమా షూట్ కి డేట్ ఫిక్స్ !

Published on Apr 8, 2019 4:50 PM IST

త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చెయ్యటానికి సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ నెల 24 నుండి ఈ సినిమా షూట్ కి వెళ్ళబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపింది. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది.

ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట.

ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత బన్నీ – త్రివిక్రమ్ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు