అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

Published on Feb 17, 2019 7:06 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మార్చి చివరి వారంలో గానీ, లేదా ఏప్రిల్ మొదటి వారంలో గాని మొదలవ్వనుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్నీ కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. బన్నికి జోడిగా పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఇక ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత బన్నీ- త్రివిక్రమ్ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ కాంబినేషన్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు