పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ ‘ఆర్య’.. వర్కవుట్ అవుతుందా!

పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ ‘ఆర్య’.. వర్కవుట్ అవుతుందా!

Published on Jun 19, 2026 9:01 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి యువతలో మంచి ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టేలా చేసిన సినిమాల్లో తన కెరీర్ ఆరంభంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా ఆర్య కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ మొదటి సినిమాగా వచ్చిన ఈ చిత్రం కొత్త ఒరవడిని సృష్టించింది. ఇక ఈ సినిమా గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం అవుతుండడం విశేషం. ఇది వరకు చాలా సినిమాలు కేవలం రీజనల్ గా మాత్రమే విడుదల అయ్యాయి.

బాహుబలి ది ఎపిక్ మినహా పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా వచ్చింది లేదు. కానీ ఇపుడు ఆర్య సినిమా తెలుగు, మలయాళం అలాగే హిందీలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు అప్పట్లోనే పాన్ ఇండియా రీచ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సో ఈ సారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇంకా దీనిపై రిలీజ్ డేట్ బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు