పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్ !

Allu Arjun

జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు ఆయన అభిమానులు. కాగా ఇప్పటికే పలువురు, సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన కథానాయకుడికి మార్నింగ్ నుంచి శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా పవన్ కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌ బాబాయ్‌. సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకుని చేసి మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్న మిమ్మల్ని నేను ఆరాధిస్తాను. మీ త్యాగం నాతో పాటు ఎన్నో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. ఆ శక్తి, ప్రేమ మీతోనే ఉంటుంది’ అని అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ని పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Exit mobile version