అల్లు అర్జున్ 19 లో నటించే నటీనటులు వీరే !

Published on Apr 24, 2019 5:15 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం యొక్క షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఇక ఈ చిత్రం యొక్క క్యాస్టింగ్ విషయంలో ఇటీవల రకరకాల వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఈసినిమా లో నటించే నటీనటులపై క్లారిటీ వచ్చింది.

ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు, రాజేంద్ర ప్రసాద్ , సత్యరాజ్ , సునీల్ , బ్రహ్మజీ , రావు రమేష్ , నవదీప్ , మురళి శర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ , గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :