
పక్కా మాస్ మసాలా సినిమాల స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను మొదటి సారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని కూడా దాదాపుగా ఖరారు చేసే పనిలో ఉంది ఈ చిత్ర టీం. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ హౌస్ సెట్లో అల్లు అర్జున్ పై వచ్చే ఓ ఫ్యామిలీ సాంగ్ ని షూట్ చేసారు. సాంగ్ షూట్ ఫినిష్ చేసిన అల్లు అర్జున్ వెంటనే యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎంసిటీ స్ట్రీట్ లో తనపై దాడి చేసిన ప్రదీప్ రావత్ మరియు అతని గుండాలను ఇరగదీస్తున్నాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేతృత్వంలో బోయపాటి శ్రీను ఈ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండేలా వినోదం, కుటుంబ విలువలను మిక్స్ చేసి బోయపాటి ఈ సినిమా కథని సిద్దం చేసారు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

