వైరల్ : పాపులర్ మ్యాగజైన్ పై అల్లు అర్జున్ కవర్ పిక్

Published on Jul 15, 2022 4:39 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల అలవైకుంఠపురములో మూవీతో పాటు పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ తో అత్యద్భుత విజయాలు సొంతం చేసుకున్న అల్లు అర్జున్, త్వరలో పుష్ప ది రూల్ మూవీ షూట్ లో జయిన్ అవ్వనున్నారు. ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

వరుసగా కెరీర్ పరంగా వరుసగా విజయాలు సొంతం చేసుకంటూ దూసుకెళ్తున్న అల్లు అర్జున్ హీరోగా భారీ క్రేజ్ సంపాదించడంతో పాటు మంచి మార్కెట్ ని కూడా ఏర్పరుచుకున్నారు. ఆయన నటించిన పుష్ప ది రైజ్ సక్సెస్, హీరోగా ఆయన రేంజ్ ని అమాంతం పెంచేసింది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఇండియాలోని మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ అయిన ఇండియా టుడేలో ఈ వారం ఎడిషన్ అల్లు అర్జున్ కవర్ పిక్ తో వచ్చింది. హీరోగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ గురించి ప్రచురితం అయిన ఈ తాజా ఎడిషన్ రేపటి నుండి మార్కెట్ లో లభ్యం కానుండగా ప్రస్తుతం ఆ పత్రిక కవర్ పిక్ లో అల్లు అర్జున్ కవర్ పిక్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో , మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :