అల్లు అర్జున్ నుండి ఇంకొంత సహాయం

Published on Mar 30, 2020 6:54 pm IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విరాళాల రూపంలో భారీ సహాయం అందుతున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలంతా పెద్ద మొత్తంలో ఫండ్స్ ఇచ్చారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు, కేరళకు రూ.25 లక్షల సహాయం ప్రకటించిన బన్నీ తాజాగా సినీ కార్మికుల కోసం కూడా తనవంతు సహకారం అందించారు.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు బన్నీ. దీంతో ఆయన కాంట్రిబ్యూషన్ మొత్తం రూ.1 45 కోట్లకు చేరింది. ఇకపోతే బన్నీ ఈమధ్యే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను స్టార్ట్ చేశారు. కొంత చిత్రీకరణ కూడా జరిగింది. లాక్ డౌన్ పీరియడ్ ముగియగానే తిరిగి షూట్ మొదలవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More