బన్నీ రెమ్యునరేషన్ డబుల్ అయిందట

Published on Jun 1, 2021 6:02 pm IST

‘అల వైకుంఠపురములో’ సినిమా విజయంతో అల్లు అర్జున్ స్టార్ డమ్ రెట్టింపు అయింది. ఆయన మార్కెట్ స్థాయి కూడ అమాంతం పెరిగింది. దీంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు బన్నీ. మార్కెట్, క్రేజ్ పెరిగితే రెమ్యునరేషన్ కూడ పెరగాల్సిందే కదా. ప్రస్తుతం చేస్తున్న ‘పుష్ప’ చిత్రానికిగాను అల్లు అర్జున్ భారీ మొత్తంలోనే పారితోషకం పుచ్చుకుంటున్నారట. ఆరంభంలో సినిమాను రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన లేదు దర్శకనిర్మాతలకు. షూటింగ్ సగంలో ఉండగా ఈ కొత్త ఆలోచన చేశారు.

దీంతో ముందు అనుకున్న కథ పెరిగింది. అల్లు అర్జున్ ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే బన్నీ పారితోషకం డబుల్ అయిందట. రెండు భాగాలు కాబట్టి ముందు అనుకున్న దానికి రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారట. ఈ రెండు భాగాలకు కలిపి నిర్మాతల నుండి బన్నీ దగ్గర దగ్గర 50 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్టు ఫిలిం నగర్ టాక్. కొందరైతే అంతకంటే ఎక్కువే ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి ‘పుష్ప’తో అల్లు అర్జున్ కెరీర్లోనే రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈ రెండు భాగాలు హిట్టైతే బన్నీని పట్టుకోవడం ఒక మోస్తారు నిర్మాతలకు అస్సలు సాధ్యపడదేమో.

సంబంధిత సమాచారం :