ఈ రేర్ 100 మిలియన్ లిస్ట్ లోకి బన్నీ సినిమా.!

Published on Apr 23, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి కానీ రీచ్ మరో లెవెల్లో ఉంటుంది. అలా ఇప్పటి వరకు బన్నీ పేరిట చాలానే రికార్డులు ఉన్నాయి. అప్పుడు “సరైనోడు” నుంచి లేటెస్ట్ “అల వైకుంఠపురములో”, “పుష్ప” వరకు కూడా బన్నీ ఖాతాలో పలు సంచలన రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన తెలుగులో ఒక రేర్ రికార్డును బన్నీ తన ఖాతలో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “డీజే”(దువ్వాడ జగన్నాధం).

హిందీలో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ అందుకున్న ఈ చిత్రం ఇపుడు డైరెక్ట్ తెలుగులో సింగిల్ ఛానెల్లో 100 మిలియన్ వ్యూస్ అందుకున్నట్టుగా దిల్ రాజు నిర్మాణ సంస్థ వెల్లడించారు. తెలుగులో డైరెక్ట్ తెలుగులో 100 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాలే చాలా తక్కువ మొదటగా ఈ ఫీట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన “శ్రీమంతుడు” సినిమాతో సెట్ చెయ్యగా ఇప్పుడు మన తెలుగు నుంచి అదే ఫీట్ ను బన్నీ సెట్ చేసి రెండో హీరోగా నిలిచాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో పాన్ ఇండియన్ ఫిల్మ్ “పుష్ప”తో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :