టాప్ 10లో నిలిచిన బన్నీ టాప్ 3కి వెళ్లగలడా ?

Published on Jan 19, 2020 9:00 pm IST

అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ వసూళ్ల పరంగా ఆయనకు కొత్త రికార్డుల్ని తెచ్చ పెడుతోంది. శరవేగంగా రూ.100 కోట్ల షేర్ మార్క్ అందుకుని బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న ఈ చిత్రం ఓవర్సీస్లో సైతం 2.5 మిలియన్ డాలర్ మార్కును టచ్ చేసి అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.

ఈ రికార్డులన్నీ కేవలం మొదటి వారం రోజుల్లోనే సాధ్యమవడం విశేషం. ఇక సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి చిత్రం ఓవర్సీస్ టాప్ గ్రాసర్ల జాబితాలో ఏ స్థానంలో నిలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో 20, 6.9 మిలియన్లతో ‘బాహుబలి 2,1’ చిత్రాలు ఉండగా 3.5 మిలియన్లతో ‘రంగస్థలం’ 3వ, 3.4 మిలియన్లతో ‘భరత్ అనే నేను’ 4వ స్థానంలో 3.2 మిలియన్లతో ‘సాహో’ 5వ స్థానంలో, 2.9 మిలియన్లతో ‘శ్రీమంతుడు’ 6వ, 2.6 మిలియన్లతో ‘సైరా’ 7వ స్థానంలో ఉన్నాయి. ఇప్పటికే 2.5 మిలియన్ మార్కును చేరుకున్న త్రివిక్రమ్, బన్నీల చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యేనాటికి ఇంకొక మిలియన్ వసూలు చేసి జాబితాలో టాప్ 3కి వెళ్ళగలదేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More