వైరల్ : అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ సందర్శించిన అల్లు అర్జున్ ఫ్యామిలీ

Published on Sep 29, 2022 5:13 pm IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్హున్ తన నెక్స్ట్ మూవీ పుష్ప ది రూల్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఇటీవల రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఆడియన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ తీస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్.

ఇక మొదటి నుండి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన సినీ, వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకునే అలవాటు గల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేడు తన సతీమణి స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఆమెకు స్పెషల్ గా విషెస్ చెప్పారు. అలానే నేడు ఆమె బర్త్ డే సందర్భంగా కూతురు అర్హ, కుమారుడు అయాన్ తో కలిసి ప్రత్యేకంగా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని దర్శించారు అల్లు అర్జున్. కాగా అల్లు ఫ్యామిలీ గోల్డెన్ టెంపుల్ విచ్చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :