Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
‘మెగాస్టార్’తో అల్లు అర్జున్ కన్ఫర్మే అయినట్లే !
Published on Feb 12, 2019 2:56 pm IST

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ నిజంగానే ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నటిస్తే.. సినిమా పై ఇంకా అంచనాలు పెరుగుతాయి. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుందని ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి దసరా సీజన్ లో విడుదలచేయనున్నామని ఇటీవలే రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :