తన నటనతోనే కాకుండా మంచి మనసుతో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తాజాగా ఒక చిన్నారి అభిమాని జీవితంలో మర్చిపోలేని సంతోషాన్ని నింపాడు. ‘మేక్ ఏ విష్ ఇండియా’ సంస్థ ద్వారా శ్రద్ధా అనే చిన్నారి తనను కలవాలనే అతిపెద్ద కలను ఆయన నెరవేర్చాడు.
ఆ చిన్నారితో అల్లు అర్జున్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఎంతో ఆనందంగా గడిపాడు. ఈ క్రమంలో శ్రద్ధా పూర్తి ఎనర్జీతో ‘పుష్ప’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఝుకేగా నహీ సాలా’ను చెప్పగా, బన్నీ ఎంతో మురిసిపోతూ ఆమెను అభినందించాడు. ఈ సరదా సంభాషణ ఆ చిన్నారికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకాన్ని అందించింది.
ఇటీవల నిరంజన్ అనే అభిమానికి స్వయంగా వెళ్లి కలిశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలా తమ అభిమానుల కోరికలను తీరుస్తూ ఈ హీరోలు మిగతా హీరోలకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.


