“పుష్ప-2″కి ఆ తప్పులు జరగకూడదన్న అల్లు అర్జున్..!

Published on Feb 20, 2022 12:00 am IST

“పుష్ప” చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన చిత్ర బృందం “పుష్ప-2” కోసం కసరత్తును ప్రారంభించింది. ఈ క్రమంలో “పుష్ప-2″పై అల్లు అర్జున్ చిత్ర బృందానికి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది.

అయితే వీలైనంత త్వరగా పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్‌కి ఎక్కువ సమయం కేటాయించాలని చిత్ర బృందానికి చెప్పాడట. ‘పుష్ప ది రైజ్’ షూటింగ్ కాస్త ఆలస్యమయ్యిందని, దీంతో అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. ప్రీ రిలీజ్ వేడుకకు సుకుమార్ కూడా హాజర్ కాలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ సారి ఆ తప్పులు జరగకూడదని అల్లు అర్జున్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :