గోనగన్నారెడ్డిగా అదుర్స్ అనిపించుకున్న అల్లు అర్జున్!

గోనగన్నారెడ్డిగా అదుర్స్ అనిపించుకున్న అల్లు అర్జున్!

Published on Mar 3, 2015 12:22 PM IST

Allu-Arjun-As-Gona-Ganna-Re
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న సినిమా.. రుద్రమదేవి. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషిస్తుండగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషిస్తున్నారు. నిజానికి ఈ పాత్రకు ఎందరో స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో పడింది. ఈ పాత్రనను అల్లు అర్జున్ చేస్తున్నాడనే వార్త రాగానే ఈ విషయం పట్ల అందరికీ ఆసక్తి కలిగింది. ఎప్పుడైతే గోనగన్నారెడ్డి గెటప్‌ను విడుదల చేశారో ఆరోజు నుంచే ఈ పాత్రపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా విడుదలైన రుద్రమదేవి ట్రైలర్‌తో అల్లు అర్జున్ పాత్రపై మరింత ఆసక్తి కలుగుతోంది. అల్లు అర్జున్ గెటప్ దగ్గరనుంచి పోరాట సన్నివేశాలు, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. భారతదేశ సినీ పరిశ్రమలో మొదటిసారిగా స్టీరియోస్కోపిక్ త్రీడీ టెక్నాలజీతో బయోపిక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. భారీ సెట్టింగులతో, విజువల్ ఎఫెక్ట్స్‌తో ట్రైలర్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతోంది. రానా, నిత్యా మీనన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు