ఈ సారి పక్కా ప్లాన్ తో రాబోతున్న అల్లు అర్జున్ !

Published on Jul 9, 2018 5:44 pm IST

అల్లు అర్జున్ ఇటీవల వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘నా పేరు సూర్య’ ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన తదుపరి చిత్రాన్ని పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. ఆయన ఎప్పుడు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తన సినిమా ఉండాలనుకుంటారు. అందుకే బన్నీకి మలయాళం లాంటి చిత్రపరిశ్రమలోనూ అభిమానులు ఉన్నారు.

కాగా, క్లాస్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రకథకు సంబంధించి బన్నీ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ప్రతిదీ పకడ్బంధీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, శాసనం నాగ అశోక్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ విన్న స్టైలిష్ స్టార్ విక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఆగష్టు రెండో వారం నుండి చిత్రబృందం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :