బన్నీ.. ట్విట్టర్‌లోకి వచ్చేశాడు..!

బన్నీ.. ట్విట్టర్‌లోకి వచ్చేశాడు..!

Published on Apr 8, 2015 9:27 AM IST

allu-arjun2
ప్రముఖ హీరో అల్లు అర్జున్ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎప్పట్నుంచో అభిమానుల నుంచి వస్తోన్న రిక్వెస్ట్‌లకు ఇప్పటికి స్పందించాడు. తమ హీరో సినిమాల విషయాలను తెలుసుకోడానికి ట్విట్టర్ ఓ మంచి వేదిక అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ముందే గ్రహించిన మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్లు ఇప్పటికే ట్విట్టర్‌లోకి వచ్చేశారు. అప్పుడప్పుడూ తమ సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గరవుతున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. తన నటనతో, మ్యానరిజంతో అశేష అభిమానులను పొందిన బన్నీ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సృష్టిస్తాడన్నది అభిమానుల నమ్మకం. నేడు తన పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులకిచ్చే కానుకగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్విట్టర్‌లో @alluarjun హ్యాండిల్ ద్వారా అల్లు అర్జున్‌ను చేరుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది

తాజా వార్తలు