బన్నీ పిల్లలు అదరగొట్టారు

Published on Nov 15, 2019 7:10 pm IST

అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్ల విషయంలో దూసుకుపోతోంది. పాటలతో ప్రచారం స్టార్ట్ చేసిన టీమ్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తోంది. ముందుగా ‘సామజవరగమన, రాములో రాములా’ పాటల్ని వదిలిన టీమ్ నిన్న చిల్డ్రన్స్ డే కావడంతో సినిమాలోని ‘ఓ మైగాడ్ డాడీ’ పాట టీజర్ ను విడుదలచేసింది. దీని కోసం బన్నీ పిల్లలు అయాన్, అర్హాలను రంగంలోకి దింపారు.

టీజర్లో అయాన్, అర్హాలు వేసిన స్టెప్స్, ఇచ్చిన క్యూట్
ఎక్స్‌ప్రెష‌న్స్ ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేశాయి. పాటపై అందరికీ ఆసక్తిని కలిగించాయి. నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఈ టీజర్ హంగామానే కనబడింది. మొత్తానికి ఏ ఉద్దేశ్యంతో అయితే అయాన్, అర్హాలను రంగంలోకి దింపారో దాన్ని నెరవేర్చారు వాళ్లిద్దరూ.

ఇకపోతే పూర్తి పాటను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 12న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :