స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!

స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!

Published on Aug 15, 2026 4:57 PM IST

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు దర్శకుడు అట్లీతో భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోనే బిజీగా ఉన్న బన్నీ నుంచి లేటెస్ట్ గా ఓ మిస్టేక్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అప్పటికపుడు యాక్టీవ్ గానే ఉంటాడని తెలిసిందే.

అయితే ఏ అకేషన్ అయినా కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన నుంచి విషెస్ తప్పకుండా ఉంటాయి. అలానే నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పోస్ట్ వేయడం జరిగింది. కానీ ఈ పోస్ట్ లో ఊహించని మిస్టేక్ ఉండటంతో తాను వెంటనే ఈ పోస్ట్ తొలగించడం జరిగింది.

అయితే అల్లు అర్జున్ పోస్ట్ లో అంతా బాగానే ఉంది. కానీ త్రివర్ణ పతాకంలో మాత్రం అశోక చక్రం లేకపోవడాన్ని తాను ముందు గమనించినట్టు లేదు. కానీ దీనిపై వచ్చిన కామెంట్స్ తో బన్నీ వెంటనే ఈ పోస్ట్ ని తొలగించడం జరిగింది. కానీ ఈ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో తన పోస్ట్ మరోలా వైరల్ అయ్యిపోయింది.

తాజా వార్తలు