సూర్య అక్కడ అదరగొడుతున్నాడు !
Published on Sep 11, 2018 8:20 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ‘ఇటీవల విడుదలై అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ లో విడుదలైయింది. ‘సూర్య ది సోల్జర్’ పేరుతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్కడ మంచి రన్ ను కనబరుస్తుంది. కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది. ఇక యూట్యూబ్ లో విడుదలైన బన్నీ నటించిన సరైనోడు , డి జె హిందీ వెర్షన్ చిత్రాలు రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కూడా అక్కడ విజయవంతం కావడంతో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లోకూడా మంచి మార్కెట్ ఏర్పడనుంది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ కి జోడిగా అను ఇమ్మానుయేల్ కథానాయికగా నటించింది. సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ ,శేఖర్ సంగీతం అందించారు.

  • 35
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook