స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో బన్నీ ?

Published on Apr 1, 2019 9:51 pm IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని.. అలాగే రొమాంటింక్ యాక్షన్ జోనర్ లో కూడా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

అయితే సుకుమార్ ఈ కథను మహేశ్ బాబు కోసం రాసాడని, కానీ మహేశ్ కి కథ నచ్చకపోవడంతో.. కథ అల్లు అర్జున్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమా కోసం చాలా విరామం తీసుకోని చేస్తున్నాడు, మరి ఇది రంగస్థలం లాగే సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :