గత ఏడాది ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెలుగు,తమిళ బాషల్లో ఓక చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటించాడు. లింగు సామి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కొన్ని కారణాలతో బన్నీఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెడుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఆయన కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
తాజాగా చిత్ర వర్గాల సమాచారం ప్రకారం లింగు సామి స్థానంలో ‘వీరం, వేదాళం ‘చిత్రాల దర్శకుడు శివతో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.
