“పుష్ప” కోసం బన్నీ నాన్ స్టాప్ ర్యాంప్.!

“పుష్ప” కోసం బన్నీ నాన్ స్టాప్ ర్యాంప్.!

Published on Oct 31, 2020 1:03 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ, సుక్కు, దేవీల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం అందులోను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చెయ్యడంతో మరిన్ని ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.

అయితే బన్నీ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ షూట్ ఎప్పుడు మొదలు కానుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు సుకుమార్ అండ్ టీం అందుకు అంతా రెడీ చేసేసి తమ డేట్ కోసం ఎదురు చూస్తున్నారట. ఈ చిత్రం తాలుకా షూట్ వచ్చే నవంబర్ 6 నుంచి మొదలు పెట్టనున్నారట.

అలాగే ఈ షూట్ నుంచే బన్నీ సరిగ్గా నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా పాల్గొననున్నాడని సమాచారం. అందుకోసం కూడా బన్నీ ఇప్పటికే అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యిపోయాడట. ఇక షూటింగ్ మొదలు కావడమే తరువాయి అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అతి త్వరలోనే బన్నీ ర్యాంప్ మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు