ఇండియా మొత్తంలో తెలుగు నుంచి బన్నీ సెన్సేషన్ మరోసారి!

Published on Dec 2, 2020 3:53 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మన తెలుగు రాష్ట్రాల్లో సహా ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అలాగే లేటెస్ట్ గా వచ్చిన “అల వైకుంఠపురములో” సినిమాతో అయితే బన్నీ క్రేజ్ మరింత స్థాయిలో విస్తరించింది. అలా ఇపుడు మళ్ళీ బన్నీ సెన్సేషన్ నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.

ఇంటర్నెట్ లో గూగుల్ లానే మరో దిగ్గజ సెర్చ్ ఇంజిన్ అయినటువంటి “యాహూ” వారు చేసిన రీసెర్చ్ లో ఈ ఏడాది 2020లో మన దేశం నుంచి అత్యధికంగా వెతకబడిన మేల్ సెలెబ్రెటీలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే మన తెలుగు నుంచి టాప్ 10 వ స్థానంలో నిలిచాడు.

అది కూడా మన దక్షణాది నుంచి ఏ ఒక్క హీరో కూడా దక్కని ఘనత సొంతం చేసుకున్నాడు బన్నీ. ఇక ఈ లిస్ట్ లో మొట్ట మొదటి స్థానంలో బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిలిచాడు. అలాగే స్వర్గీయ లెజెండరీ గాయకులు ఎస్ పి బాలు గారు 7.

లాక్ డౌన్ లో ఎందరో నిస్సహాయులకు ఆపద్బాంధవునిలా నిలిచిన సోనూ సూద్ 8వ స్థానంలో నిలిచాడు. అలాగే అమితాబ్, సల్మాన్ లాంటి అగ్ర నటులతో మన తెలుగు నుంచి బన్నీ ఒక్కడికే స్థానం దక్కడం విశేషం. దీనితో మరోసారి జాతీయ స్థాయిలో బన్నీ సెన్సేషన్ నమోదు అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More