బాలీవుడ్ లోకి బన్నీ !

Published on May 2, 2019 4:00 pm IST


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ డబ్బింగ్ సినిమాలకు హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. బన్నీ సరైనోడు, నా పేరు సూర్య వంటి చిత్రాలకు హిందీ యూట్యూబ్ ఛానల్స్ ల్లో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి.

అందుకే బాలీవుడ్ నుండి బన్నీకి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయట. మరి త్రివిక్రమ్ సినిమా తరువాత బన్నీ బాలీవుడ్ లో సినిమా చేస్తాడేమో చూడాలి. ఇక త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ కాస్త వైవిధ్యంగా కనిపించచబోతున్నాడట. బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ని చూస్తామని చెబుతుంది చిత్రబృందం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్.

సంబంధిత సమాచారం :

More