మలయాళ బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్ ‘కొత్త లోక’తో సెన్సేషన్‌గా మారింది. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు (రూ.300+ కోట్లు) చేసిన మలయాళ సినిమాగా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఐతే, తాజాగా కల్యాణీ ప్రియదర్శన్ గురించి ఆమె తండ్రి, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారు. తెలుగు మూవీతోనే ఆమె నటిగా ఎలా మారిందో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ‘కల్యాణి సినిమాల్లోకి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. కల్యాణి చిన్నతనంలో సినిమా సెట్స్‌కు వచ్చేందుకూ కూడా ఇష్టపడేది కాదు. ఆర్కిటెక్ట్ కావాలన్నది తన డ్రీమ్. దాని కోసం ప్రయత్నిస్తుండగా.. ఓరోజు నాగార్జున నాకు కాల్ చేశారు. ‘‘హలో!’ సినిమాలో హీరోయిన్ గా మీ అమ్మాయిని అనుకుంటున్నాం’ అని చెప్పారు. కల్యాణికి నటన రాదని నేను బదులిచ్చాను. కానీ ఒక్కసారి ప్రయత్నిస్తా నాన్నా’ అని కళ్యాణి తెలుగు సినిమాతో నటిగా మారింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.


