నోటా మొదట ఆ స్టార్ హీరో దగ్గరికి వెళ్ళింది !

Published on Sep 28, 2018 1:00 pm IST


‘నా పేరు సూర్య’ చిత్రం తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. ఇక ఈచిత్రం తరువాత బన్నీని ‘నోటా’ డైరెక్టర్ ఆనంద్ శంకర్ కలిశాడట. నోటా కథను మొదట బన్నీ కి వినిపిస్తే ఈ కథ తనకు సెట్ అవ్వదని ఆయన రిజెక్ట్ చేశాడని సమాచారం.

ఆతరువాత అదే కథతో ఆనంద్ శంకర్ యువ హీరో విజయ్ దేవరకొండ ను కలిశాడట. విజయ్ కు కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ సినిమాతోనే విజయ్ తమిళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈచిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :