అసలు “పుష్ప” ఎలా స్టార్ట్ అయ్యిందో రివీల్ చేసిన ఐకాన్ స్టార్.!

Published on Dec 9, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి అంచనాలతో ఉంది. అయితే అసలు ఈ సినిమాపై స్పెషల్ అంచనాలు నెలకొనడానికి కారణం ఈ కాంబినేషన్ అని చెప్పాలి.

అల్లు అర్జున్, సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్ ల కాంబోకి ఒక బెంచ్ మార్క్ ఉంది. అలా వీరి నుంచి హ్యాట్రిక్ సినిమా అనేసరికి దీనిపై ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. మరి అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో అల్లు అర్జున్ నిన్న ఈటీవీలో ప్రసారం అయ్యినటువంటి డాన్స్ రియాలిటీ షో “ఢీ 13” స్టేజ్ పై తెలిపారు.

సుకుమార్ తాను మళ్ళీ సినిమా చెయ్యాలి అనుకున్నప్పుడు వస్తే మళ్ళీ సరైన కథతోనే నీ దగ్గరకి వస్తాను మామూలు సినిమా అయితే చెయ్యను అని సుకుమార్ చెప్పేవాడని అలా పుష్ప కథతో వచ్చాడని నేను కూడా ఆ సరైన కథ ఇదే అనుకుంటున్నాని ఐకాన్ స్టార్ తెలిపాడు.

అలాగే అల్లు అర్జున్ మరిన్ని మాటలు జోడిస్తూ తాను ఎమోషనల్ గా పర్సనల్ గా కానీ విషయాలు పంచుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అది సుకుమార్ నే అని అల్లు అర్జున్ అసలు విషయం తెలిపాడు.

సంబంధిత సమాచారం :